Telangana Congress New Incharge: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ పదవి నుంచి దీపాదాస్ మున్షీ ఔట్, నూతన ఇంచార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నియామకం
తెలంగాణతో పాటూ హిమాచల్ ప్రదేశ్, చంఢీగడ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిషా, జార్ఖండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, బీహార్ రాష్ట్రాలకు ఇంచార్జ్‌లను మారుస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలుగా భూపేష్ భగేల్, సయ్యద్ నజీర్ హుస్సేన్‌ను నియమించారు.
Hyderabad, FEB 14: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ఉన్న దీపాదాస్ మున్షిపై (Deepadas Munshi) వేటు పడింది. ఆమె పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డితో పాటూ ముఖ్యనేతలు అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలకు బలం చేకూరుస్తూ ఆమెను పదవి నుంచి తప్పించారు. దీపాదాస్ మున్షి స్థానంలో మరో మహిళా నేత మీనాక్షి నటరాజన్‌ను (Meenakshi Natarajan) నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది ఏఐసీసీ.
AICC Appoints Meenakshi Natarajan as Telangana Congress Incharge
అయితే తెలంగాణతో పాటూ హిమాచల్ ప్రదేశ్, చంఢీగడ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిషా, జార్ఖండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, బీహార్ రాష్ట్రాలకు ఇంచార్జ్‌లను మారుస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలుగా భూపేష్ భగేల్, సయ్యద్ నజీర్ హుస్సేన్‌ను నియమించారు.